#అన్నవస్తున్నాడు_ఫీజు_రియంబర్సమెంట్_వివరణ.
A).విద్యార్థులకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసం.
B).విద్యార్థుల భవిష్యత్ కోసం దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయం.
C).వైయస్సార్-పీజ్ రియంబర్సమెంట్.
#A).విద్యార్థులకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసం: చంద్రబాబు గారు తన బడ్జెట్ లో విద్యకు ప్రాధాన్యత ఇచ్చి రూ.41,335 కోట్లు కేటాయించి చివరికి విద్యార్థులకు మొండిచేయి చూపించారు. మీకు వివరంగా తెలియాలంటే..ఈ బడ్జెట్ ఒకసారి చూడగలరు.
• సాధారణ విద్యకు రూ.19,897 కోట్లు
• ఉన్నత విద్యకు రూ. 3513 కోట్లు
• పాఠశాల విద్యకు రూ. 17,197 కోట్లు
• సాంకేతిక విద్యకు రూ.728 కోట్లు.
ఇంత పెద్ద బడ్జెట్ లో కనీస అవసరాలు కూడా లేకుండా విద్యార్థులు చదవటం మన చూస్తునే ఉన్నాం.
ఇవికాక మన చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ఘోరాలు..
* ఆ మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత ఫీజు రియంబర్స్‌మెంట్ అనే పథకాన్ని నీరు గార్చేసారు.
* చంద్రబాబు ప్రభుత్వం ఒకవైపు ప్రైవేట్ కళాశాలలు ఫీజులు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చారు.
* ఫీజు రియంబర్స్‌మెంట్ మాత్రం ఒక్క రూపాయి కూడా పెంచలేదు. దీన్ని ఫలితంగా చదువులు ఆగిపోయే పరిస్థితి నెలకొంది.
* చంద్రబాబు ప్రభుత్వం 2015-16కు ఫీజు రియంబర్స్‌మెంట్ ఇంకా 50 శాతం ఇంకా విద్యార్థులకు చెల్లించాల్సి ఉంది.
#B).విద్యార్థుల భవిష్యత్ కోసం దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయం.
దివంగత మహనేత ప్రియతమ నాయకుడు వైయస్ రాజశేఖరరెడ్డి గారు ప్రతి పేదవాడు చదవాలి, చదువు కోసం డబ్బులు లేనితనం అడ్డుగా ఉండకూడదు. డబ్బులు లేకున్నా ప్రతీ పేదవాడికి చదువుకునే పరిస్థితి రావాలని వైయస్ రాజశేఖరరెడ్డి ఫీజు రియంబర్స్‌మెంట్ అనే స్వప్నంను ముందుకు తెచ్చారు.
*మెడిసిన్ చదవాలంటే సంవత్సరానికి రూ. 50 వేలు, ఇంజనీరింగ్ చదవాలంటే సంవత్సరానికి రూ. 30 కట్టాల్సి వస్తుంది దీనిని మన దివంగత నేత తన భుజాలపై వేసుకున్నారు.
* వైయస్సార్ అన్ని ప్రైవేట్ కళాశాలలో ఫీజులు రూ. 30వేలు దాటకూడదన్న నిబంధన పెట్టారు.
* ఫీజులు పెంచే అవకాశం లేకుండా చేసి... ప్రతి పేదవాడి చదువుకు అయ్యే ఖర్చులను రాజన్న ప్రభుత్వం కళాశాలలకు డబ్బులు చెల్లించింది.
* ఫీజు రియంబర్స్‌మెంట్ ద్వారా కాలేజీలు, విద్యార్థులు బాగుపడి మెరుగైన చదువులు చదివారు.
* ఏ పేదవాడైనా తనకు నచ్చిన చదువును అప్పు చేయకుండా నేను తోడుగా ఉండి చదివిస్తా అని భరోసా ఇచ్చారు.
#C).వైయస్సార్-పీజ్ రియంబర్సమెంట్:
సుమారు 16 లక్షల మంది విద్యార్థులకు చదువుకి అయ్యే
మొత్తాన్ని భరిస్తూ..భోజనానికి,వసతికి అదనంగా రూ 20 వేలు ప్రతీ విద్యార్థి తల్లిదండ్రులకి నేరుగా ఇవ్వబడుతుంది.
చదువుతున్న ఏ విద్యార్థి తన తల్లిదండ్రులకి భారం కాకుండా ఉండాలన్నదే మన జగనన్న ఆశయం.
జయహో..రాజన్న.#Raju Anna You Are Great.
Comments
Post a Comment