నవ్యాంధ్రకు నవరత్నాలు
‘నవ్యాంధ్రకు నవరత్నాలు’ పోస్టర్ ను మన పలాస నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త డా.అప్పలరాజు(రాజన్న)గారు కార్యకర్తల సమక్షంలో ఈ రోజు ఆవిష్కరించారు .
ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజన్న మాట్లాడుతూ, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళుతున్నారని, ప్రజలకు భరోసా ఇచ్చేందుకు, చంద్రబాబు సర్కార్ చేస్తున్న మోసాలను తెలియజెప్పేందుకే ‘అన్నొస్తున్నాడు’ పేరిట త్వరలో పాదయాత్ర చేపట్టనున్నారని చెప్పారు.
తొమ్మిది హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆగస్టు 10 నుంచి 25వ తేదీ వరకూ పలాస నియోజకవర్గం లో సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. అదేవిధంగా వైఎస్సార్ వర్థంతి సందర్భంగా సెప్టెంబర్ 2 నుంచి అక్టోబర్ 7 వరకూ ప్రతి ఇంటికీ నవ్యాంధ్ర నవరత్నాలు కరపత్రాలను పంపిణీ చేస్తామని చెప్పారు.
Comments
Post a Comment