కుటుంబ సమేతంగా తన నివాసంలో వినాయక చవితి పూజలో రాజన్న.
ఓం కారమే గణపతి. గణపతి సృష్టికి ముందు, సృష్టి తర్వాత ప్రళయానంతరం కూడా సత్యస్వరూపుడై ప్రకాశించేవాడు. లక్ష్మీ గణపతిగా, విద్యాగణపతిగా, సిద్ధి గణపతిగా, తాండవ గణపతిగా, సింధూర గణపతిగా, ఏకదంతునిగా పూజిస్తే స్వర్వారిష్టాలు తొలగి సర్వజయాలు కలుగుతాయి. గణనాంపతిః గణపతిః అని వ్యుత్పత్తి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల మహదాధితత్తాలకు ఆయన అధిపతి కాబట్టి, గణపతి అయ్యాడు. సమస్త చేతన, అచేతన వర్గాలకు ఆయనే అధిపతి. ప్రతి కార్యారంభంలోనూ విఘ్నేశ్వరపూజ జరుపుతూనే వున్నా భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుని ప్రత్యేకంగా పూజించడంలోని విశిష్టత ఆ రోజు వినాయకుడు జన్మించడమేగాక ఆనాడే ఆయనకు విఘ్నరాజత్వం సంప్రాప్తించడం జరిగింది.
ఈ శుభ సమయంలో మన రాజన్న కుటుంబం చేత పూజలు అందుకుంటున్న ఆ మహాగణపతి తన చల్లని చూపులులతో మన రాజన్నకి ఎల్లవేలలా తోడుండాలని ఆ భగవంతుడుని రాజన్న యువసేన తరుపున ప్రార్దిస్తున్నాను.
సర్వేజనా సుఖినోభవంతు.
Comments
Post a Comment